శ్రీదేవి డ్రామా కంపెనీ.. బుల్లితెర ప్రేక్షకులకు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పెంచేందుకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా సరికొత్త  కాన్సెప్టుతో తెర మీదకి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.  జబర్దస్త్ లో ప్రతీ వారం  ప్రేక్షకులను అలరించే కమెడియన్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ పంచూతున్నారు.  అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్రతి వారం కూడా కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ వారం కూడా కూడా వినూత్నమైన కాన్సెప్టు తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 400 సంవత్సరాల క్రితం అంటూ ప్రారంభం అయ్యే ప్రోమో  అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏకంగా కత్తి పట్టుకొని ఆటో రాంప్రసాద్ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలోనే ఇక రామ్ చరణ్ మగధీర సినిమాలో లాగా ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసి ఆటో భైరవ అంటూ రాంప్రసాద్ పేరు చెబుతారు.  ఇక ఆ తర్వాత హైపర్ ఆది బాస్మతి రాజ్యానికి రాజు అంటూ హైపర్ ఆది కి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఇలా ఇక వీరిద్దరి మధ్య ఏకంగా ఒక యుద్ధమే జరుగుతుంది.


 ఇక వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీగా మంచి సరికొత్త పంచులతో  అటు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు.  ఇటీవలే విడుదలైన ప్రోమో చూస్తూ ఉంటే అటు ఇక ఈ వారం కూడా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని అటు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమో పై మీరు కూడా ఒక లక్కెసి కాసేపు నవ్వుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv