ఇటీవల కాలంలో ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా మరొక భాషలో రీమేక్ కావడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కొన్ని కొన్ని సార్లు ఒక భాషలో కనెక్ట్ అయిన సినిమా ఇంకో భాషలో కనెక్ట్ కాకపోవచ్చు. ఇంకొన్నిసార్లు ఒక భాషలో హిట్ అయిన సినిమా ఇంకో భాషలో దానికి మించిన హిట్ గా మిగులుతుంది. అలా చాలా సినిమాలు ఒక రకం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీస్తే వేరే రకం ప్రేక్షకులకు పెద్దగా నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు. అలా ఎన్నో చిత్రాలు విభిన్నమైన ఫలితాలను మేకర్స్ కు అందించగా తమిళ భాషల్లో సూపర్ హిట్ అయినా ఓ చిత్రం మాత్రం తెలుగులో రీమేక్ అయ్యి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.

అదే 96.  తమిళంలో విజయ్ సేతుపతి మరియు త్రిష జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ రేంజ్ లో హిట్ కాగా తెలుగులో కూడా ఈ సినిమాను జాను అనే పేరుతో రీమేక్ చేయగా ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. శర్వానంద్ సమంత హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ఎంతో నమ్మకంతో చేసిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే భారీ ఫ్లాప్ టాక్ మూటకట్టుకొని ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరిచింది. తమిళ ప్రేక్షకులకు ఇచ్చిన కిక్ తెలుగు ప్రేక్షకులకు ఇవ్వకపోవడమే ఈ సినిమా దారుణం గా ఫ్లాప్  కావడానికి కారణాలు అని చెపుతున్నారు.

ఇకపోతే ఈ సినిమాను హిందీ లో కూడా రీమేక్ చేసే విధంగా అక్కడి మేకర్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన హక్కులను భారీ రేటు పెట్టి కొనుగోలు చేసిందట బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ. అయితే అక్కడ హీరో హీరోయిన్ లు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని సదరు మేకర్స్ తెలియజేయగా ఈ చిత్రం తెలుగు మాదిరిలా కాకుండా తమిళ సినిమా మాదిరిగా సూపర్ హిట్ గా నిలుస్తుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: