మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్ర షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ తన గత సినిమాల కంటే ఎక్కువ స్టైలిష్ గా కనిపిస్తూ ఉండగా కీర్తి సురేష్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ గా చెబుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకోగా ఈ సినిమాతో మళ్లీ మరొక భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఈ సినిమాతో కూడా అదే రేంజ్ లో హిట్ దక్కించుకోవాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుగా ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు పెంచింది. ఇక పోతే ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేసుకుంటోంది. వచ్చే వారమే మొదటి పాటను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట.

 వరుస సూపర్ హిట్ సాంగ్ లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న తమన్సినిమా లో సంగీతం మరో లెవెల్ లో ఇచ్చాడని భావిస్తున్నారు. మరి ఇంతమంది భారీ తారాగణంతో చేస్తున్న ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఉందో చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతు ఉండగా  మహేష్ బాబు ను నెవర్ బిఫోర్ అనే లుక్ లో ఈ చిత్రంలో చూస్తామని గర్వంగా చెబుతున్నారు ఆయన అభిమానులు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాను వివిధ భాషలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది. మరి తొలిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న మహేష్ బాబు కి ఏ రేంజ్ హిట్ వస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: