2005వ సంవత్సరంలో ప్రభాస్ చత్రపతి సినిమా తో ఎంతటి ఘన విజయం అందుకొన్నాడు మనకు తెలిసిన విషయమే. దీంతో మాస్ అభిమానులు కూడా ఈయనను ఇష్టపడడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్లాపులతో సతమతం అయ్యాడు ప్రభాస్. ఇక అలాంటి సమయంలోనే తమిళ సినిమా అయినటువంటి "బిల్లా"సినిమాలో రీమిక్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. కొందరు మీరు ఫ్యామిలీ ఆడియో సినిమా తీయొచ్చు కదా, ఎప్పుడు యాక్షన్ సినిమాలోనే తీస్తారు అంటూ కొందరు అడుగగా.. వారు చెప్పింది కూడా నిజమే నంటూ ప్రభాస్ ఆలోచించడం మొదలు పెట్టాడట.


 దాంతొ ప్రభాస్ ఒక ఫ్యామిలీ సినిమాని కానీ, లవ్ స్టోరీ ని కానీ తీయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ కరుణాకరన్ పిలిపించారట. కథ నచ్చితే సినిమా తీద్దామని ప్రపోజల్ పెట్టారట ప్రభాస్. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కరుణాకరన్  అలా స్టార్ హీరోలతో సినిమా చేద్దామని అనుకుంటున్న సమయంలో ప్రభాస్ డైరెక్టుగా కరుణాకరన్ ను పిలవడంతో.. అప్పటికప్పుడు తనదగ్గర ఉన్న  కథ ని వివరించారు కరుణాకరన్.

ఆ లైన్ బాగా నచ్చడంతో ప్రభాస్ కథ అంతా సిద్ధంగా ఉందా అని అడగగా స్టోరీ రాయడానికి మూడు నెలల సమయం పడుతుందని తెలియజేశారు డైరెక్టర్ కరుణాకరన్. కథని త్వరగా రెడీ చేయండి బిల్లా సినిమా అయిపోయిన వెంటనే సినిమా చేద్దామని తెలియజేశారు ప్రభాస్. ఇక ప్రభాస్ ఈ కథ ను తన ఫ్రెండ్స్ తో కలిసి విన్నారు. అందరు సూపర్ గా ఉంది అనడంతో ఓకే అని చెప్పేసాడు ప్రభాస్.

మగధీర షూటింగ్ సమయంలో కాజల్ చూసిన కరుణాకరన్ తనే మన సినిమాలో హీరోయిన్ అని తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో ఎంతోమంది నటులను పెట్టి సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైన మంచి సక్సెస్ ను అందుకుని ప్రభాస్ కు మంచి పేరు తెచ్చింది. దీంతో ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: