జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షో గా కొనసాగింది. ఎన్నో ఏళ్ల నుంచి తిరుగులేని కామెడీ షో గా ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో కార్యక్రమం ఆకట్టుకుంటుంది. అయితే జబర్దస్త్ కార్యక్రమం అటు కామెడీ షోలలో సంచలనం సృష్టించింది అని చెప్పాలి. కేవలం టాప్ షోగా కొనసాగడమే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి ఇక జబర్దస్త్ లైవ్ ఇచ్చింది అని చెప్పాలి. కాగాఇక ప్రతి వారం కూడా జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సరికొత్త ఎంటర్ టైన్మెంట్ పంచుతూ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.



 ఇకపోతే గతవారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా ఈ షో నవ్వించగా.. ఇక వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇక ఈ ప్రోమోను చూసి ఎంతో మంది నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో లో భాగంగా అదిరే అభి స్కిట్  కాస్త సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. అయితే అదిరే అభి స్కిట్ కొనసాగుతున్న సమయంలో ఏకంగా  ఒక లేడీ కంటెస్టెంట్ అదిరే అభి కి ఒక స్మాల్ వార్నింగ్ ఇస్తుంది. ముసలాడి పాత్రలో స్టేజ్ మీదకి వస్తాడు అదిరే అభి. ఈ క్రమంలోనే  గడ్డం నవీన్ ఏకంగా అదిరే అభికొడుకు గా ఉంటాడు.


 ఇంతలో అదిరే అభి స్కిట్ లో భాగంగా ఓ మహిళ స్టేజి మీదికి ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే గడ్డం నవీన్ ఏకంగా ఆ మహిళను ఆంటీ అని పిలుస్తాడు. దీంతో తన చేతిలో ఉన్న గిన్నె  కోపంగా స్టేజ్ మీద కొడుతుంది సదరు మహిళ. ఇదిగో అభి గారు మీరు నన్ను మరొక ఎపిసోడ్కి పిలవక పోయినా పర్వాలేదు కానీ వీడితో మాత్రం ఆంటీ అనిపించారు అనుకోండి అస్సలు ఊరుకోనూ అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఇక అదిరే అభి స్కిట్ మాత్రమే కాకుండా అటు రాఘవ స్కిట్ కూడా ప్రేక్షకులు అందరినీ ఎంతగానో కడుపుబ్బ నవ్విస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: