ఆయన తీరుతో చాలా మంది ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.. అయితే ఆయన ఎంత కఠినంగా ఉంటాడో అంతకు మించి గొప్ప మనసు ఉందని అలాగే ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను ఎప్పటికీ మరువడని తెలుస్తుంది.. అలాగే తనకు మంచు ఫ్యామిలీ చేసిన సాయాన్ని ఎప్పుడు మరువలేను అని చెప్పిందట ఓ టాలీవుడ్ నటీమణి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా మంచు కుటుంబం తనకు చేసిన సాయం ఏంటో తెలుసా ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
మంచు ఫ్యామిలీ సాయం పొందిన ఆ నటీమణి మరెవరో కాదట కితకితలు సినిమాతో మనందరినీ నవ్వుల్లో ముంచెత్తిన గీతా సింగ్. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు సినిమాలు చేసిందని తెలుస్తుంది.. వాటిలో ఎక్కువగా కామెడీ ఫిల్మ్స్ ఉన్నాయని సమాచారం.ఒకప్పుడు బాగా అవకాశాలు పొందిన ఈ అమ్మడు ఆ తర్వాత నెమ్మదిగా తెర మరుగు అయ్యిందని కొన్నాళ్ల పాటు మాత్రం తెలుగు తెరపై ఈ అమ్మడు ఎంతో సందడి చేసిందని తెలుస్తుంది.
ఒకానొక సమయంలో గీతా సింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమా షూటింగ్ కు వెళ్లిందని సమాచారం.
అక్కడి తన షాట్ పూర్తయ్యాకపక్కకు వెళ్లి కూర్చుందని తెలుస్తుంది. ఏదో ఓ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతుందట ఈ విషయాన్ని మంచు విష్ణు గమనించాడని విషయం ఏంటని అడిగాడట. అయితే తన పిల్లల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పిందని సమాచారం.పెళ్లి కాకుండానే పిల్లలు ఎలా అని అడిగాడట తను. తన అన్నయ్య చనిపోవడంతో ఆయన పిల్లలను నా పిల్లలుగా చూసుకుంటున్నానని ఆమె చెప్పిందట. దీంతో తన విద్యా సంస్థల్లో ఆమె పెద్ద బాబుకు ఉచితంగా విద్యను అందించినట్లు చెప్పుకొచ్చిందట. మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా ఎంతో గౌరవంగా తమను చూశారని చెప్పిందట గీతా సింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి