నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయిక నుంచి వచ్చే సినిమాలను అభిమానులు ఏ స్థాయి లో ఆలోచిస్తారో అందరికీ తెలిసిందే. వారి కాంబినేషన్ నుంచి కూడా ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఎలాంటి అంశాలను పెడితే చూస్తారో అన్న విషయాన్ని గుర్తించి దానికి తగ్గట్లుగానే ఈ సినిమాను చేస్తారు.  అలా వీరి కాంబో లో ఇప్పుడు అఖండ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈరోజు రాగా బాలకృష్ణ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించగా సినిమా లో ఆయన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు.

ఇందులో ఒక పాత్ర ప్రళయాన్ని గుర్తు చేస్తే మరొక పాత్ర ప్రకృతిని గుర్తు చేసింది అని ప్రేక్షకులు చెబుతుండడం విశేషం. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం కూడా బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని బోయపాటి ఎక్కడ తగ్గకుండా డిజైన్ చేసిన సీన్ లు గా అనిపిస్తుంది. ప్రతి సీన్ కూడా అభిమానులతో ఈలలు కొట్టించే ఎలివేషన్ ఇచ్చారు. బోయపాటి డిజైన్ చేసిన సన్నివేశాలు కూడా అలానే ఉండడం గమనార్హం. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ డైలాగులు మరొక హైలెట్ కాగా బోయపాటి శీను తనను తాను నిరూపించుకునే విధంగా ఈ సినిమాను రూపొందించాడు.

ఇక విడుదల తర్వాత విజయ ఢంకా మోగడమే అని అందరూ అనుకోగా ఇప్పుడు సినిమా విషయంలో కొంత నెగిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా బోయపాటి శ్రీను వెనక్కి తగ్గేలా చేసినట్లు అవుతుంది. ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేసిన విధంగా ఈ చిత్రం లేదనే టాక్ బయట కు రాగా ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇదే వాదన ఎక్కువగా జరుగుతుంది. అన్ని అంశాలు ప్రేక్షకులను ఎంతో కొంత నేర్పించిన కూడా కథ కథనాల విషయంలో బోయపాటి శీను మళ్ళీ పాత చింతకాయ పచ్చడి నే వాడాడు అని అంటున్నారు. ఏదేమైనా వినయ విధేయ రామ పరాభవాన్ని మరిచిపోతున్న బోయపాటి ఇప్పుడు అఖండ సినిమా విషయంలో ఎలాంటి విమర్శలు ఎదురవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: