నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఏ రేంజ్ లో విజయవంతం అయ్యాయ్యో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో చిత్రం అఖండ కూడా ఈరోజు విడుదల కాగా ఈ సినిమా కు మిశ్రమ స్పందన దక్కడం విశేషం. ఈ సినిమా విడుదలకు ముందు ఈ చిత్రంలోని ట్రైలర్ పాటలు సూపర్ హిట్ కాగా బాలకృష్ణ అంటే హై వోల్టేజ్ సినిమాలలో ఎక్కువ గా కనబడటంతో ఈ సినిమా లో కూడా అలాంటి యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.

బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో ఇప్పటికే ఒక అంచనా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాపై అంతకంటే ఎక్కువగా అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వచ్చారు.  వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే బ్రేకులు తీసేసిన బండిలా విచ్చలవిడిగా మాస్ ఉంటుందని జనం అని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం హిట్ కొట్టాలని చెప్పి లాజిక్ లు లేకుండా కొన్ని సీన్స్ లో ఎక్కువ వయోలెన్స్ వచ్చి ప్రేక్షకులను కొంతవరకు నిరాశపరిచింది. 

సినిమా కు ఇంత ఎలివేషన్ రావడానికి కారణం హీరో అయితే హీరోయిజం ఎలివేట్ చేయడం లో ఎక్కువ శ్రద్ధ చూపిన బోయపాటి శ్రీను అత్యుత్సాహం ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడానికి కారణం. ఒక ఊరిలోను ఫ్యాక్షనిస్ట్ లను భయపెట్టి వారిని మార్చే పాత్రలో అలాగే అఘోర పాత్ర లో బాలకృష్ణ నటించిన ఇంకొక ఇలా కొత్త రకమైన గెటప్ తో అలరించాడు. ఈ విధంగా ఆయన ఎక్కువగా గెటప్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా విషయాలు పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అదో రకమైన భావం ఏర్పడింది. మరి లుక్స్ విషయంలో అయినా పర్ఫెక్ట్ గా ఉన్నారా అంటే కొన్ని కొన్ని సీన్స్ లో బాలకృష్ణ వృద్ధాప్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన చేసిన అఘోర పాత్రలో చొక్కా తీసేసి చేసి ధైర్యం చేసినా కొంతవరకు ఫ్యాక్షనిస్టు పాత్రలో ఆయన తన వయసు ను చూపించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: