తెలుస్తున్న సమాచారం మేరకు బన్నీ వచ్చేనెల నుండి రెండు నెలలు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్. తన రెస్ట్ నుండి తిరిగి వచ్చాక దేశంలోని కరోనా పరిస్థితులను బట్టి తన తదుపరి సినిమాల నిర్ణయం తీసుకుందామని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంటనే ‘పుష్ప 2’ ను మొదలుపెట్టకుండా బోయపాటి లేదంటే కొరటాల దర్శకత్వంలో ఒక మూవీని చేసి ఆతరువాత ‘పుష్ప 2’ వైపు రావాలని బన్నీ ఆలోచన అంటున్నారు.
ఈలోపున సుకుమార్ ను ఒక చిన్న సినిమా చేసుకోమని సలహా ఇవ్వాలని బన్నీ ఆలోచనలు చేస్తుంటే ఆవిషయాలను పక్కకు పెట్టి ఫిబ్రవరి నుండి ‘పుష్ప 2’ షూటింగ్ ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తూ ఉండటం బన్నీకి ఏమాత్రం ఇష్టం లేదు అని అంటున్నారు. అయితే ఈవిషయంలో సుకుమార్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు.
లేటెస్ట్ గా విడుదలైన ‘పుష్ప’ పార్ట్ 1కు డివైడ్ టాక్ రావడంతో ‘పుష్ప 2’ మేకింగ్ ఆలస్యం అయితే ఆమూవీకి ఉన్న క్రేజ్ అంతా పోతుంది కాబట్టి వెంటనే ‘పుష్ప 2’ షూటింగ్ ను మొదలుపెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని బోయపాటి ఆలోచన అని అంటున్నారు. అయితే బన్నీ మాత్రం మరొకసారి వెంటనే సుకుమార్ పెట్టే కష్టాలకు రెడీగా లేడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో సంకేతాలు వస్తున్నాయి. దీనితో వాస్తవానికి ‘పుష్ప 2’ ఇప్పట్లో ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధత కొనసాగుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి