సాధారణమైన మనుషుల్లోనే  ఒకరి మధ్య ఒకరికి గొడవలు చోటు చేసుకోవడం సహజమని అందరికి తెలుసు.అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ కి ఒకరి పై పగ సాధించే సమయం పెట్టుకోవడం అంటే కష్టమే అని తెలుస్తుంది.

అందుకే సందర్భం వచ్చినప్పుడు గొడవలు పడ్డవాళ్ళు సమాధానపడిపోతారని తెలుస్తుంది . తర్వాత కలిసి మెలిసి తిరుగుతారని ఇలాంటి వాటికి సినీ పరిశ్రమ ఏమీ అతీతం కాదట వాళ్ళలో కూడా ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు ఉంటాయని కాకపోతే ఎక్కువగా కెమెరా ముందు కనపడాల్సి ఉంటుంది కనుక

వాటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించుకోవాలనుకుంటారట.సరే ఇక అసలు విషయానికి వస్తే  గతంలో అంటే 2006 లో రవితేజకి బాలయ్యకి మధ్య ఏదో వివాదం చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయట.. ఓ దశలో బాలయ్య.. రవితేజ పై కూడా చెయ్యి చేసుకున్నాడు అనేది ఈ వార్త సారాంశమని తెలుస్తుంది..అప్పటి నుండీ వీళ్ళ మధ్య మాటలు కూడా లేవు అంటారట.. 'బలుపు' సినిమాలో రవితేజ.. బాలయ్యని ఇమిటేజ్ చేసే సీన్ ఒకటి ఉంటుందట.

 

అలాగే 'కిక్2' లో కూడా 'సారి చెప్పారా బాలిగా' అనే డైలాగ్ కూడా ఉంటుందట. అయితే 'ఆహా' లో బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' కి గెస్ట్ గా రవితేజ వచ్చాడట బాలయ్యని హగ్ చేసుకున్న వెంటనే అతనికి ఎదురైన మొదటి ప్రశ్న 'ఏంటి నీకు నాకు మధ్య పెద్ద గొడవ జరిగిందట' అని..! దీనికి రవితేజ 'పని పాట లేని ప్రతీ డ్యాష్ నా డ్యాష్ గాళ్ళకి ఇదే పని' అంటూ సమాధానం ఇచ్చాడని తెలుస్తుంది. నిజానికి 'అన్ స్టాపబుల్' షో ప్రారంభమైనప్పటి నుండీ ఇలాంటి కవరింగ్లే జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఈసారి కూడా అంతే..! పనిలో పనిగా రవితేజ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఇష్యు గురించి కూడా ఓ ప్రశ్న అడిగేశాడట బాలయ్య. రవితేజ ఆన్సర్ ఏమిచ్చి ఉంటాడు అనేది ఫుల్ ఎపిసోడ్ లో చూడాలనే విధంగా ప్రోమోని కట్ చేశారని తెలుస్తుంది.దీంతో ఈ షో పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయట. 'ఇది కవరింగ్ ల షో' అని ఒకరు 'కవరింగ్ లు 'అన్ స్టాపబుల్' అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఇంకొందరు అయితే 'ఆడియెన్స్ కు క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో ఆర్జీవీని మించిపోయాడుగా అల్లు అరవింద్' అంటూ చెప్పుకొస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: