
అలాగే సుహాస్ మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ నటుడు కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇతను కూడా ఎటువంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటులు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు. అయితే ఇపుడు ఇదే తరహాలో ఓ యంగ్ స్టర్ ఇండస్ట్రీ లోకి రావాలని ఆశపడుతున్నాడట. ఇండియాలో టాప్ బెస్ట్ బిజినెస్ మాన్ లిస్టులో ఉన్న ఓ ప్రముఖ బిజినెస్ మాన్ కొడుకు సినిమా లో నటించాలని తెగ ఆశపడుతున్నాడట.
ఆశతో పాటుగా కుర్రాడు హీరో రేంజ్ లో మంచి హైట్, కలర్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. కాబట్టి తండ్రి కూడా తనయుడు కోరికను నెరవేర్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఇద్దర్నీ కలసి బడ్జెట్ నేను భరిస్తా మీ డైరెక్షన్ లో సినిమా తీసి మా వాడ్ని ఇండస్ట్రీలో నిలబెట్టండి అని కోరారట ఆ బిజినెస్ మాన్. ప్రస్తుతం వివరాలు బయటకు రాలేదు కానీ టాలీవుడ్ ఇపుడు డైరెక్టర్లకు ఇదే హాట్ న్యూస్ అయ్యిందని అంటున్నారు.