సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొడుకులు రమేశ్‌ బాబు, మహేశ్‌ బాబు ఇద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రమేశ్‌ బాబు యాక్టింగ్‌కి బ్రేక్ ఇచ్చి సైలెంట్ అయిపోతే, మహేశ్‌ సూపర్‌స్టార్‌గా దూకుడు చూపిస్తున్నాడు. కృష్ణ బాటలో చిన్న అల్లుడు సుధీర్‌ బాబు కూడా సినిమాల్లోకి వచ్చాడు. 'ఎస్.ఎమ్.ఎస్.' సినిమాతో హీరోగా లాంచ్ అయిన సుధీర్, ఇంకా నంబర్‌ రేసులో అడుగుపెట్టలేదు గానీ, సొంత మార్క్‌ మాత్రం క్రియేట్ చేశాడు. తెలుగులో ఫిట్టెస్ట్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు.

కృష్ణ మనవడు, మహేశ్‌ బాబు మేనళ్లుడు, రాజకీయనాయకుడు గల్లా జయదేవ్ కొడుకు గల్లా ఆశోక్‌ హీరోగా లాంచ్ అవుతున్నాడు. సొంత బ్యానర్‌ అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో 'హీరో' సినిమాతో వెండితెర మీదకి వస్తున్నాడు అశోక్. ఇక ఈ 'హీరో' సంక్రాంతికి జనవరి 15న విడుదలవుతోంది.

ఇక చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలున్నారు. చిరంజీవి చిన్నళ్లుడు కళ్యాణ్‌ దేవ్‌ కూడా సినిమాల్లోకి వచ్చాడు. పెళ్లికి ముందు కళ్యాణ్‌ దేవ్ సినిమాల్లో నటించలేదు. శ్రీజని పెళ్లి చేసుకున్నాక వెండితెరపైకి వచ్చాడు కళ్యాణ్‌ దేవ్.

చిరంజీవి మేనల్లుళ్లు సాయి ధరమ్‌ తేజ్, వరుణ్‌ తేజ్‌ కూడా సినిమాల్లోకి వచ్చారు. సాయి తేజ్‌ 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి లుక్స్‌తో ఉన్న తేజ్‌ పెర్ఫామెన్స్‌కి మెగాఫ్యాన్స్‌ బాగానే కనెక్ట్‌ అయ్యారు. ఇక సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో మెగాఫ్యామిలీ హీరోల గురించి బయటజరుగుతోన్న ప్రచారంపైనా కామెంట్‌ చేశాడు. చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ కూడా పోయినేడాదే సినిమాల్లోకి వచ్చాడు. 'ఉప్పెన' సినిమాతో వైష్ణవ్‌ తేజ్ హీరోగా లాంచ్ అయ్యాడు. ఇక ఈ మూవీ సూపర్ హిట్‌ కావడంతో వైష్ణవ్‌కి ఫస్ట్‌ మూవీతోనే క్రేజీ ఇమేజ్ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: