టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ లవ్లీ ఫెయిర్ గా పేరు తెచ్చుకొని ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు రష్మిక, విజయ్ దేవరకొండ. వీరిద్దరూ మొదటిసారి కలిసి 'గీత గోవిందం' సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి నిజంగానే వీళ్ళు ప్రేమలో ఉన్నారని అనుకున్నారంతా. అంతే కాదు ఆ సమయంలో వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలు సైతం షికార్లు చేశాయి. అంతే కాదు అదే సమయంలో రష్మిక మందన సైతం తన ప్రియుడు రోహిత్ శెట్టి తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. విజయ్ దేవరకొండ తో నిజంగానే రష్మిక మందన ప్రేమలో ఉండడం తోనే ఆమె రోహిత్ కు బ్రేకప్ చెప్పిందని చాలామంది అన్నారు.

అయితే ఈ వార్తలపై ఇద్దరు ఎప్పుడూ కూడా కామెంట్ చేయలేదు. గీత గోవిందం సినిమా తర్వాత మళ్లీ ఈ జంట డియర్ కామ్రేడ్ సినిమాలో కనువిందు చేసింది. ఆ సినిమాలో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ 31న గోవాలో ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని మరో హిట్ ఇచ్చారు ఈ జంట. సంక్రాంతి పండగ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన కుటుంబం తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా..

రష్మిక కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ, రష్మిక ఒకే కలర్ డ్రెస్ లో కనిపించారు. విజయ్ దేవరకొండ రెడ్ కలర్ కుర్తా వేయగా.. రష్మిక కూడా రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఇక ఈ ఫోటోలను చూసినవారందరూ వీరిద్దరు నిజంగానే లవ్ లో ఉన్నారని.. అందుకే సంక్రాంతి సందర్భంగా ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ లో మెరిసారు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగా వీరిద్దరూ లవ్ లో ఉండే ఇలా పండక్కి సేమ్ కలర్ డ్రెస్లో మెరిసారా? లేకపోతే అది యాదృచ్చికంగా జరిగిందా? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: