బుల్లి తెర పై.. సుధీర్ , రష్మీ తర్వాత.. అంతటి క్రేజ్ సంపాదించిన వారిలో హైపర్ ఆది, అనసూయ ఒకరు. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఎంతో పాపులర్ గా అవుతూ ఉంటుంది. హైపర్ ఆది-అనసూయ పై ఏదో ఇంకా కోరిక ఉన్నట్లుగా.. ప్రేమిస్తున్నట్లుగా ఆది వేసే ప్రతి డైలాగ్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. ఆది చేసే ప్రతి స్కిట్ లో కచ్చితంగా అనసూయ గురించి ఏదో ఒక్క విషయం పై ఆమెను వాడుతూనే ఉంటాడు. తాజాగా ఇప్పుడు మరొకసారి అనసూయ పై కొన్ని డైలాగులు కొట్టడం జరిగింది. అది కూడా పుష్ప సినిమాని స్పూఫ్ చేశారు హైపర్ ఆది.

ఏదైనా సినిమాలను స్పూఫ్ చేసి వాటిని స్కిట్ రూపంలో మార్చడం కేవలం హైపర్ ఆది కే సాధ్యం అని చెప్పవచ్చు. వచ్చే గురువారం కి ఈసారి కొత్త స్కిట్  రెడీ చేశారు హైపర్ ఆది. ఆది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన గెటప్ వేసి.. అల్లు అర్జున్ లా చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు. ఇక పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర గురించి అనసూయ పై కొన్ని సెటైర్లు వేయడం కూడా జరిగింది. ఇక పుష్ప సినిమాలో నటించిన కేశవ ని కూడా ఈ స్కిట్ లో తీసుకువచ్చి.. కడుపుబ్బా నవ్వించాడు ఆది.

ఇక కేశవ్ పుష్ప సినిమాలో శ్రీ వల్లి తో జరిగిన కొన్ని సన్నివేశాలను హైపర్ఆది ఇక్కడ చేసి చూపించాడు. హైపర్ ఆది ,అనసూయ నన్ను ప్రేమిస్తోందని తెలుసు.. అది నెరవేరాలంటే పది వేల రూపాయల కంటే పెద్ద పూజ ఏదైనా ఉంటే చేయమంటూ కేశవ్ కి తెలియజేస్తాడు.. ఈ విషయంపై అనసూయ నవ్వి నవ్వలేక ఉంటుంది.. ఇక అంతే కాకుండా ఈ స్క్రిప్ట్ చూస్తే హైపర్ ఆది-అనసూయ పై మరింత ఒలకపోస్తున్నాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: