బాహుబలి రెండు భాగాల సినిమాలతో ప్రభాస్ భారీ స్థాయిలో నేషనల్ వైడ్ గా ప్రేక్షకులను అలరించి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఆయన హీరోగా ఎదగడానికి తొలిమెట్టు బాహుబలి సినిమానే అయినప్పటికీ పునాది వేసింది మాత్రం సాహో సినిమా అని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ప్రభాస్ ఇమేజ్ ఒకటే కారణం కాలేదు. రాజమౌళి క్రెడిట్ కూడా ఈ సినిమాలో సగం ఉంది. దాంతో బాహుబలి సినిమా విషయంలో కొంత భాగం క్రెడిట్ మాత్రమే ప్రభాస్ వచ్చింది. అయితే సాహో సినిమా తో పూర్తి స్థాయి సొంత ఇమేజ్ తో ప్రేక్షకులను అలరించాడు.

దాంతో అదృష్టంకొద్దీ కాదు తన టాలెంట్ తో నే పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు ప్రభాస్ అని అందరూ అనుకునేలా చేశాడు. ఆ చిత్రం అక్కడ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో ఆయనకు అక్కడ మంచి పాపులారిటీ ఏర్పడింది. బాలీవుడ్ లో సైతం భారీ అభిమాన గణం ఏర్పడడంతో ప్రభాస్ 100 కోట్ల హీరోగా మారిపోయాడు ఇప్పుడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో పాటు భారీ పారితోషికాలు తీసుకుని చేస్తున్న సినిమాలే. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం చేస్తున్న సలార్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కబోతోందని తెలుస్తుంది.

ఒక సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడం అనేది ఇటీవల కాలంలో ఎక్కువైన నేపథ్యంలో బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చి ఆయనకు భారీ స్థాయిలో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ విధంగా ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని తెలియడంతో ఆ చిత్రం కూడా బాహుబలి లాగానే భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు. మరి ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ ప్రయోగం ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: