ఇక వరుస సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.. అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకుంది కామ్నాజఠ్మలానీ. ముఖ్యంగా అల్లరి నరేష్ తో కలిసి నటించిన బెండు అప్పారావు సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కానీ కొంతకాలం నుంచి మాత్రం కామ్నాజఠ్మలానీ సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఈటీవీలో ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది.
ఇక ఈ అమ్మడిని చూసి ఎంతో సంతోషించారు అభిమానులు. కామ్నాజఠ్మలానీ అందం ఎక్కడ చెక్కుచెదరలేదు అని అనుకున్నారు. ఇక రీ ఎంట్రీ ఇస్తే ఇస్తే బాగుంటుంది అని భావించారు. ఈ క్రమంలోనే ఈ అమ్మడు మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది. స్టోరి డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతోంది కామ్నాజఠ్మలానీ. పలు తమిళ సినిమాల్లో నటించేందుకు ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. కాగా 2005లో తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగు కన్నడ సినిమాల్లో కూడా నటించింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి