అయితే జబర్దస్త్ కార్యక్రమం అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సరికొత్త రీతిలో ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చేందుకు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న కమెడియన్స్ అందరికీ కూడా తన టాలెంట్ నిరూపించుకునేందుకు ఒక మంచి అవకాశం ఇచ్చింది జబర్దస్త్. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్స్ తమదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక వెండితెరపై కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.
అయితే ఇక జబర్దస్త్ జడ్జ్ గా మొదట్లో నాగబాబు రోజా ఉండేవారు. కానీ ఆ తర్వాత ఏమైందో నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. ఇక నాగబాబు స్థానంలో ఎంతో మంది కొత్త జడ్జీలు వచ్చారు. కొన్నాళ్లపాటు సింగర్ మను జడ్జిగా కొనసాగారు. కానీ గత కొంత కాలం నుంచి సింగర్ మను జబర్దస్త్ లో కనిపించడం లేదు. అయితే ఇక ఇప్పుడు రోజా తో పాటు ఆమని జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే మరో బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా జబర్దస్త్ లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది అని అర్థమవుతుంది. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించి తన అందం అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్ లైలా జబర్దస్త్ జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ అమ్మడి నవ్వులు జబర్దస్త్ కార్యక్రమం లో అందరినీ ఉత్తేజపరిచాయ్ అని చెప్పాలీ..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి