టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ పరుశురామ్ పెట్లా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న సూపర్ స్టార్ మహేష్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటి దాకా ఈ సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ - బ్లాస్టర్ టీజర్ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించాయి. 'కళావతి' పాట యూట్యూబ్ లో 12 కోట్ల వ్యూస్ తో వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ మధ్యనే సూపర్ కిడ్ సితార పాపతో చేసిన 'పెన్నీ' సాంగ్ మ్యూజిక్ వీడియో అయితే పెద్ద సెన్సేషనల్ గా మారింది. రెగ్యులర్ గా వివిధ సందర్భాల్లో స్పెషల్ పోస్టర్లతో సందడి చేస్తున్న మేకర్స్..ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మాస్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఇందులో చెక్డ్ షర్ట్ ఇంకా అలాగే బ్లాక్ జీన్స్ ధరించిన మహేష్ బాబు బీచ్ లో ఫైట్ కు సిద్ధమవుతున్నాడు. స్టైలిష్ గా చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు.
ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ అని అర్థం అవుతోంది. రామ్ - లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఈ ఫైట్ ను డిజైన్ చేశారు.ఇక గూండాలు ఆయుధాలతో తన వైపుకు దూసుకొస్తుండగా.. మహేష్ బాబు తన బెల్టును బిగించి యాక్షన్ కోసం రెడీగా ఉన్నాడు.ఇక టీజర్ లో కూడా ఇలాంటి బెల్ట్ బిగించే సీన్ ఉండటాన్ని బట్టి చూస్తే.. ఫైట్స్ లో దీన్ని మహేష్ బాబు మేనరిజంగా పెట్టారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.డైరెక్టర్ పరశురామ్ 'సర్కారు వారి పాట' సినిమాలో వింటేజ్ మహేష్ బాబును ప్రెజెంట్ చేయనున్నారు. ఫ్రీ హెయిర్ స్టైల్ ఇంకా అలాగే మెడ మీద రూపాయి కాయిన్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆకట్టుకున్నాడు. ఇప్పటి దాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ లో 'పోకిరి' సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి