ఒకప్పుడు సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకి మధ్య ఎంత దూరం ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆ దూరం పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పాలి. సోషల్ మీడియా కారణంగా సినీ సెలబ్రిటీలు నేరుగా తన అభిమానులతో ముచ్చటిస్తూన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా కెమెరా ముందు అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే  ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సినీ సెలబ్రిటీల జీవితంలో ఉన్న విషాదకర ఘటనల గురించి తెలిసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతారు.


 నవ్వుతూ కనిపించే సెలబ్రిటీ కదిలిస్తే కన్నీరు తెప్పించే విషయం ఉందా అని వాపోతూ ఉంటారు. ఇప్పుడు నటుడి పృద్వి గురించి తెలిసి ఇలాగే షాక్ అవుతున్నారు అభిమానులు. నటుడు పృథ్వి   గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. అటు తమిళం కన్నడంలో కూడా బాగానే పాపులారిటీ సంపాదించారు. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఏదైనా కార్యక్రమానికి వచ్చాడు అంటే చాలు తనదైన శైలిలో అలరిస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ అనే కార్యక్రమానికి వచ్చాడు పృథ్వి.



 ఈ క్రమంలోనే తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాడు. ప్రోమో ఎంతో సందడి సందడి గా సాగిపోయింది. కానీ ప్రోమో చివరిలో తన జీవితంలో జరిగిన ఒక విషాదకర ఘటన గురించి చెప్పుకొచ్చాడు. కెరియర్ లో సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మంచి హిట్స్ కూడా వస్తున్నాయి. అంతలోనే ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆనందం రెట్టింపు అయింది. కానీ అంతలోనే ఒక చేదు వార్త తెలిసింది. తన కొడుకు ఆటిజం తో బాధపడుతున్నాడు అనే విషయం తెలిసింది. దీంతో డబ్బు క్రేజ్ అంత ఎందుకు తన కొడుకే సరిగా లేనప్పుడు అని డిప్రెషన్లోకి వెళ్లి పోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు పృథ్వి..

మరింత సమాచారం తెలుసుకోండి: