తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..సినిమా ప్రారంభంలో భారీ అంచనాలతో మొదలై మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.చిన్న హీరోల సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యి కొంత పార్ట్ షూట్ అయ్యాక ఆగిపొయాయి.మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వినాలని ఉంది సినిమా అనౌన్స్ చేశారు. అప్పట్లో వర్మ స్టార్ డైరెక్టర్‌. వర్మ - చిరు కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఊర్మిళ, టబు హీరోయిన్లు. కారణం తెలియదు కాని.. వర్మ తీరు నచ్చక చిరుయే వదిలేశాడని అంటారు.
 

ఇక చిరంజీవి హీరోగా సురేష్‌కృష్ణ దర్శకత్వంలో అబు సినిమా ప్లాన్ చేశారు. ఏఆర్‌. రెహ్మన్‌ను మ్యూజిక్‌కు పెట్టి మరీ సినిమాను మొదలు పెట్టి, ఆపేసారు.వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ఆటా నాదే. వేట నాదే అనుకున్నా మధ్యలో ఆగిపోయింది. నాగార్జున - మహేష్‌బాబు మణిరత్నం కాంబినేషన్లో రావాల్సిన సినిమా కూడా స్క్రిఫ్ట్ దశలో ఆగిపోయింది.నాగార్జున , ధనుష్‌ల కాంబోలో ధనుష్ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే మల్టీస్టారర్ రావాల్సి ఉంది. షూటింగ్ మొదలై ఓ షెడ్యూల్ అయినా కూడా మధ్యలో ఆపేశారు.


ఇక పవర్ స్టార్ నటించిన సత్యాగ్రహి 2003లో ఈ సినిమాను అనౌన్స్ అయ్యింది. దాసరి క్లాప్ కొట్టగా.. విక్టరీ వెంకటేష్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు. వినాయక్ ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ హీరోగా జీసస్ క్రైస్ట్ సినిమా అనుకున్నారు. షూటింగ్ కోసం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది..ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన మెరుపు సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది..ఇలా చాలా మంది హీరోల సినిమాలు మధ్యలోనే ఆగి పోయాయి. వాటిని ఫ్యుచర్ లో అయిన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: