బాలయ్య బాబు, పూరి జగన్నాథ్ లు ఏ ముహూర్తాన కలిసారో కానీ వాళ్ళ బంధం మాత్రం విడదీయరానిదిగా మారిపోయింది. నిజానికి బాలయ్యకి పూరి హిట్ అయితే ఇవ్వలేదు.


అయినా, బాలయ్య మాత్రం పూరి పై ప్రత్యేక ప్రేమను చూపిస్తుండటం విశేషం. ఇటీవలే పూరి లైగర్ ను పూర్తి చేశాడట.. ఐతే, వెంటనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే విజయ్ దేవరకొండతో రెండో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు. ఈ సినిమా పేరు జనగణమన. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైందని తెలుస్తుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందట..అయితే, ఈ సినిమా బిజీలో కూడా పూరి బాలయ్య కోసం ఒక కథను రాశాడు. బాలయ్యతో పని చేయాలని పూరి ఆశ పడటం నిజంగా విశేషమే. పైగా పూరి చెప్పిన లైన్ బాలయ్యను బాగా ఇంప్రెస్ చేసిందని సమాచారం.. టాలీవుడ్ లో ఒక దర్శకుడు గతంలో ఎన్నడూ ఇలాంటి కథ రాయలేదు అని బాలయ్య కితాబు కూడా ఇచ్చాడని సమాచారం.. అన్నట్టు ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేది వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో. అప్పటివరకూ పూరి ఫోకస్ అంతా కూడా జనగణమన మీదే.ఈ లోపు బాలయ్య కూడా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేయనున్నాడని తెలుస్తుంది.. 'బాలయ్య బాబు' వయసు ప్రస్తుతం 61 సంవత్సరాలు. సహజంగా 60 దాటాక ఏ హీరో అయినా కూడా రిస్కీ షాట్స్ చెయ్యడు. డ్యాన్స్, ఫైట్స్ అంటూ ప్రయోగాల జోలికి అస్సలు పోడు. కానీ, బాలయ్య వేరు. బాలయ్య సినిమాలు లాగే, ఆయన స్వభావం కూడా ఎప్పుడు కూడా దూకుడుగానే ఉంటుంది. దీనికితోడు.. బాలయ్య చేసిన 'అన్ స్టాపబుల్ షో' ప్రపంచానికి బాలయ్యలోని మరో వ్యక్తిని పరిచయం చేసింది..'బాలయ్య ఇలా ఉంటాడా ? బాలయ్యలో ఇంత మంచితనం ఉందా ?' అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. బాలయ్య వ్యక్తిత్వం జనానికి కూడా బాగా నచ్చింది. ఈ షో తర్వాత బాలయ్య క్రేజ్ నేషనల్ రేంజ్ లో పాకింది. అందుకే, అరవై ఏళ్ల వయసులో కూడా బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారట.అందుకే.. బాలయ్య కూడా వరుస సినిమాలను కమిట్ అవుతున్నారు.


ప్రజెంట్ బాలయ్య, గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.. ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా స్టార్ట్ చేయనున్నాడట.ఈ సినిమా తర్వాతే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో బాలయ్య కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడని సమాచారం.ఈ సినిమా వచ్చే ఏడాది చివరి నుంచి మొదలు కానుందట 

మరింత సమాచారం తెలుసుకోండి: