ఇక ఈ గురువారం విడుదలైన చిత్రాలలో ది లెజెండ్ మూవీ కూడా ఒకటి. తమిళ బిజినెస్ మ్యాన్ లెజెండ్‌ శరవణన్‌ కథానాయకుడిగా పరిచయమవుతూ, స్వయంగా ఆయనే నిర్మించిన చిత్రం 'ది లెజెండ్'. ఇన్నాళ్లూ వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 50ఏళ్ల వయసులో ఈ సినిమాతో కథానాయకుడిగా మారారు.ఇక నటుడిగా మారాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో ఆయన వెలుగులోకి వచ్చారు.ఈ భారీ ప్రాజెక్ట్లో ఊర్వశి రౌటేలా కథానాయిక. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరించిందో తెలుసుకుందాం.ఈ సినిమా ప్రారంభం నుండే గతంలో వచ్చిన చాలా సినిమాలు గుర్తుచేస్తుంది. ఇంకా సన్నివేశాల్లో కొత్తదనం ఏమీ లేదు.నటుడు శరవణన్ చాలా సన్నివేశాల్లో అసలు పూర్తిగా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా ఒక బొమ్మలా కనిపిస్తాడు.గీతిక పాటల్లో అయితే అందంగా కనిపించింది కానీ సినిమాలో పెద్దగా చేసేదేమీ లేదు. ఊర్వశి రౌతేలా పరిమిత పాత్రలో ఓకే అనిపించింది.


VJ గా నటుడు సుమన్ విలన్‌గా బాగున్నా, అతని లుక్స్ అయితే చాలా కృత్రిమంగా ఉన్నాయి. వివేక్, యోగి బాబు అయితే కొన్ని సార్లు నవ్విస్తారు. మిగతా నటీనటులందరూ కూడా తమ వంతు పాత్రను చక్కగా చేశారు.దర్శకులు జేడీ- జెర్రీ ఎంతో సాధారణమైన కథను అదికూడా ఈ పాత కథను కొత్తగా చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాతో రజినీకాంత్ నటించిన 'శివాజీ- ది బాస్‌' సినిమాని గుర్తు చేశారు. అంతేకాకుండా సినిమా స్టోరీ లైన్ కూడా చాలా పాతది కావడంతో ప్రేక్షకులు కాస్త నిరుత్సాహానికి గురవుతారు. నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గలేదు. ఇక శరవణన్ సినిమాని అన్ని విధాలుగా గ్రాండ్‌గా చేయడానికి అవసరమైనంత ఖర్చు చేసినట్లు అనిపిస్తుంది. ఆర్.వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హారిస్ జయరాజ్ సంగీతం ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: