లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. అందమైన ప్రేమ కథలను తెరకెక్కిస్తే ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. తాజాగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సీతారామం సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ కథానాయకగా నటించినది. అలాగే రష్మిక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఇక ఇందులో రష్మిక తో పాటు భూమిక, భాస్కర్ , సుమంత్, గౌతమ్ మీనన్ తదితరులు ముఖ్యమైన పాత్రలో నటించారు.


వైజయంతి మూవీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్, టీజర్స్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు శ్రోతలను కూడా విపరీతంగా అలరించడం గమనార్హం. ఈరోజు విడుదలవుతున్న కారణంగా ప్రీమియర్ షో చూస్తున్న ఆడియన్స్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి రివ్యూ ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉంది అనే అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదిక గా పంచుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే సీతారామం సినిమా ఒక క్లాసిక్ లవ్ డ్రామా అంటూ తెగ పొగిడేస్తున్నారు సినీ ప్రేక్షకులు.  సుమారుగా చాలా రోజుల తర్వాత ఒక అందమైన నిజాయితీ ప్రేమ కథను చూస్తున్నాం అంటూ మరికొంతమంది ట్వీట్ చేయడం జరిగింది.


ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తున్నాయి అని,  ఇక బిజిఎం బ్యాగ్రౌండ్ కూడా చాలా అదిరిపోయింది అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమా మరొక క్లాసిక్ లవ్ రొమాంటిక్ సినిమాగా మిగిలిపోతుంది అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ప్రీమియర్ షో తోనే ఈ సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: