నటుడి గా , నిర్మాత గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరుచుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కళ్యాణ్ రామ్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించు కున్నాడు .

ఆ తర్వాత హరే రామ్ , పటాస్ , 118 మూవీ లతో మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న కళ్యాణ్ రామ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకున్నడు . కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన టాక్ ని సాధించి ,  ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తోంది .

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి హిట్ స్టేటస్ ను అందుకుంది. ఇది ఇలా ఉంటే బింబిసార మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రేక్షకులను అలరించేందుకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కష్టపడతాను అని , బింబిసార మూవీ కి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలను కళ్యాణ్ రామ్ తెలియజేశాడు. బింబిసార మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో క్యాథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: