జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ లవర్ బోయ్ ఇమేజ్ తో కెరియర్ కొనసాగిస్తున్నాడు. అయితే మధ్యలో కొన్ని మాస్ అటెంప్ట్ చేసినా సరే వర్క్ అవుట్ కాలేదు. ఇక లేటెస్ట్ గా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో మరోసారి తన మాస్ అటెంప్ట్ తో మెప్పించాలని చూశాడు నితిన్. అయితే అది మళ్లీ బెడిసి కొట్టింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా ఆశించిన స్థాయిలో లేదని రిపోర్ట్ వచ్చింది.

నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా పక్కా రొటీన్ కథతో వచ్చింది. కథ పాతదే అయినా కథనం ఏమన్నా కొత్తగా ఉంటుందా అంటే అది కూడా రొటీన్ గానే నడిపించారు. నితిన్ మాస్ అప్పీల్ కొద్దిమేరకు ఓకే అనిపించినా సినిమాలో విషయం లేకపోవడంతో అతను కూడా తేలిపోయాడు. ఫైనల్ గా నితిన్ కు మాస్ కలిసి రాదని మరోసారి మాచర్ల సినిమాతో ప్రూవ్ అయ్యింది.

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అమ్మడికి కూడా తన ఖాతాలో ఓ ఫెయిల్యూర్ సినిమాగా ఈ మూవీ పడింది. ఉప్పెనతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అయితే మొదతి 3 సినిమాలు సూఒపర్ హిట్ కాగా ఈమధ్యనే రామ్ తో చేసిన ది వారియర్.. నితిన్ తో చేసిన మాచర్ల సినిమాలు నిరాశపరచాయి. మాచర్ల నియోజకవర్గం సినిమా ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మించారు. సినిమాతో నితిన్ ని మాస్ హీరోగా నిలబెట్టాలని అనుకున్నా సరే రొటీన్ కంటెంట్ తో వచ్చేసరికి ప్రేక్షకులు పెదవివిరుస్తున్నారు. అయితే నితిన్ మాత్రం ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో బాక్సాఫీ దగ్గర పెద్దగా ప్రభావం చూపించట్లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: