నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ఈరోజు విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది. సినిమా కథ విషయానికి వస్తే..అద్భుత వైద్య రహస్యాలను పొందుపరిచి ఒక సీక్రెట్ ప్లేస్ లో భద్రపరిచిన శ్రీకృష్ణుడి కంకణం చేజిక్కించుకోవాలని కొంత మంది దుర్మాగులు ప్రయత్నిస్తుంటే.. తన ప్రమేయం లేకుండా హీరో ఆ ట్రాక్ లోకి వచ్చి ఇక ఆ కంకణాన్ని సాధించి లోక కళ్యాణానికి ఉపయోగించడం..అలాగే ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో సినిమా కథ నడుస్తుంది.ఇక మొదటి సీన్ నుంచి చివరి దాకా ఓ విధమైన క్యూరియాసిటీ అనేది క్రియేట్ అయ్యింది. అయితే విలన్ ఇంకా హీరో మధ్య పెద్దగా ఏమి జరిగినట్లు అనిపించదు. ఇందులో హీరో క్యారక్టర్ కు ఎదురేలేనట్లు ముందుకు వెళ్తూంటుంది. విలన్ పాత్రకు సరైన స్టాండ్ అనేది కనపడదు. ఇది గొప్ప కథ కాదు కానీ నేపధ్యం కొత్తగా ఉండటం ఇంకా స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉండటం కలిసొచ్చింది.అలాగే డ్రామా కూడా బాగా పండింది. ఫస్టాఫ్ లో సినిమా ద్వారక చుట్టూ తిరగటం, కృష్ణుడు భక్తులైన అభిరా తెగ వారు చేసే ఎటాక్ లతో ఇంట్రెస్టింగ్ గా నడిచిపోయింది. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా బాగా సెట్ అయ్యింది.


ఇక సెకండాఫ్ లో కాస్త లాగినట్లు అనిపించినా, క్లైమాక్స్ కు వచ్చేసరికి బాగా సర్దుకున్నారు. ముఖ్యంగా అనుపమ ఖేర్ పాత్ర సినిమాని లేపి నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇంకా అలాగే రొటీన్ లవ్ ట్రాక్ లు వంటివి సినిమాలో పెట్టకపోవటం కూడా పెద్ద రిలీఫ్.ఇందులో కంకణానికి సంబంధించిన క్లూస్ ఒక్కోటి తెలుసుకుంటూ, చివరగా దాన్ని సాధించే క్రమం బాగుంది.ఇక ఈ సినిమా హైలెట్స్ లో మొదట చెప్పుకోవల్సింది కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా సీన్స్ కు ఇది చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఆ తర్వాత కెమెరా వర్క్ కూడా సినిమాని నెక్ట్స్ లెవల్ కు తీసుకెల్లింది. ఇక డైరక్టర్ విషయానికి వస్తే.. రొటీన్ కు వెళ్లకుండా కథను చాలా థ్రిల్లింగ్ నేరేషన్ లో చెప్పటం కలిసొచ్చింది. ఈ సినిమా స్క్రిప్టులోనే చాలా భాగం సక్సెస్ అయ్యాడు. మేకింగ్ పరంగా కూడా చందూ మొదటి సినిమా నుంచి మంచి మార్కులు వేయించుకుంటూనే ఉన్నాడు. ఇక ఇలాంటి సినిమాలకు కావాల్సిన ఆర్ట్ వర్కు చాలా ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ చాలా నీట్ గా ఉంది. డైలాగులు అయితే యావరేజ్ గా ఉన్నాయి. అనుపమ ఖేర్ పాత్రకు మాత్రం చాలా బాగా రాసారు. VFX వర్క్ కూడా చాలా బాగా కుదిరింది. చీప్ థ్రిల్స్ అనేవి లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగా రిచ్ గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: