ఇటీవల తెలుగు పరిశ్రమలో సమస్యలు ఉన్నాయని ఇంకా థియేటర్లకి జనాలు రావట్లేదని కొంతమంది అగ్ర నిర్మాతలు సినిమా షూటింగ్స్ ఆపేసి పరిష్కారాల కోసం మీటింగ్స్ పెడుతున్న సంగతి తెలిసిందే.అయితే సినిమాల షూటింగ్స్ బంద్ ని చాల మంది కూడా వ్యతిరేకించారు. అలాగే దీనిపై పలువురు నిర్మాతలు కౌంటర్లు కూడా వేస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై నటుడు ఇంకా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇక ఇందులో బండ్ల గణేష్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇక బండ్ల గణేష్ మాట్లాడుతూ.. 'సినిమా అనేది నా జీవితం. సినిమా నాకు ఎంతో ఇష్టమైన పదం. నేను ఈ సినిమా కోసమే బతుకుతున్నాను. ఈ మధ్య సినిమాలు ఆడటం లేదు ఇంకా జనాలు థియేటర్స్‌కు రావడం లేదని కొంతమంది గోల చేసి గగ్గోలు పెడుతున్నారు. కానీ పరభాష హీరో వచ్చి ఇక్కడ పెద్ద సూపర్ హిట్ కొట్టాడు. అలాగే మిడిల్ రేంజ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఇంకా చిన్న హీరో నిఖిల్ తమ సినిమాలతో సూపర్ హిట్ కొట్టారు.


మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మంచి కథ ఉండి మంచి కథనంతో అద్భుతంగా తెరకెక్కిస్తే ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా ఇంకా ఏ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. మనం బడ్జెట్లు పెంచుకుని వందల కోట్లు ఇంకా వేల కోట్లతో సినిమాలు తీసి వంద కార్లు ఎగిరాయి, వంద టైర్లు ఎగిరాయి, చేతిలో హీరో ఓ రాడ్ పట్టుకుని వెనుక ఓ వంద మందిని పెట్టుకుని భమ్ అని లేపితే జనాలు వస్తారునుకోవడం తప్పు. గుండెకు హత్తుకునే, జనాలు కూర్చోబెట్టగలిగే సినిమాలు తీసినంత కాలం మనకు అసలు అపజయం లేదు. ఈ బంద్‌లు ఇంకా రేట్లు తగ్గించుకోవడం వంటివి కాకుండా మంచి సినిమా తీయడంపై దృష్టి పెడదాం. మంచి సినిమాలు తీయాలని మనం కోరుకుంటున్నాను. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఆదరిస్తారు.ఇంకా ఆశీర్వదిస్తారు' అని తెలిపాడు. దీంతో ఇక బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడమే కాక నెటిజన్లు బండ్లన్న వ్యాఖ్యలకి మద్దతు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: