సక్సెస్ ఉన్న దర్శకుల చుట్టూ పెద్ద హీరోలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఆ విధంగా అర్జున్ రెడ్డి సినిమాతో భారీ సక్సెస్ అందుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగ చుట్టూ టాలీవుడ్ హీరోలు నిత్యం ప్రదక్షిణలచేస్తూనే ఉన్నారు. ఈ సినిమా విడుదలయ్యి చాలా రోజులే అవుతున్న కూడా ఇంకా ఈ దర్శకుడికి ఎంత డిమాండ్ ఏర్పడుతుంది అంటే ఆయన దర్శకత్వ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చేసిన సినిమా నే మళ్లీ బాలీవుడ్ లో చేసి అక్కడ కూడా ఇదే విధమైన ఫలితాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా త్వరలోనే తెలుగు సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే యానిమల్ అనే సినిమా చేస్తున్న సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత ప్రభాస్తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్ ని కూడా నిర్ణయించారు. వెరైటీ కథ కథనాలను కలిగి ఉన్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ ఎంతగానో అలరిస్తుంది అన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్న సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నటు వంటి వార్తలు వినిపిస్తున్నాయి.
మంచి ట్రాక్ రికార్డు కలిగిన దర్శకులను ఎంచుకోవడంలో మహేష్ బాబు స్టైల్ వేరు. ఇప్పటివరకు ఎంతమంది దర్శకులకు మంచి జీవితాన్ని కల్పించిన మహేష్ బాబు ఈ దర్శకుడు తో ఎప్పుడో సినిమా చేయవలసి ఉంది కానీ దురదృష్టవశాత్తు వీరిద్దరి మధ్య సినిమా రూపొంద లేకపోయింది. దాంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ సినిమా తర్వాత ఏ హీరోతో కూడా సినిమా ఒప్పుకోకపోవడంతో ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి