రజినీకాంత్ వల్ల దెబ్బతిన్న స్టార్ హీరోయిన్..? అంటూ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహా వచ్చిన సమయంలో కోలీవుడ్‌తో పాటు మన టాలీవుడ్‌లోనూ మాట్లాడుకున్నారు.
దీనికి కారణం అప్పటికే స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో విపరీతమైన పాపులారిటీని తెచ్చుకొని వెలుగుతున్న సౌందర్యకి దక్కాల్సిన క్యారెక్టర్ రజినీకాంత్ వల్ల దక్కకపోవడమే. రజినీకాంత్ నటించి ఆయన కెరీర్‌లో మైల్ స్టోన్‌లా మిగిలిన సినిమాలలో నరసింహా ఒకటి.

తమిళంలో పడయప్పా అనే పేరుతో 1999లో రిలీజై కోలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఓ స్ట్రైట్ సినిమాకు దక్కిన ఆదరణ దక్కింది. తమిళ, తెలుగు భాషలో అఖండ విజయాన్ని అందుకున్న ఈ సినిమా కథ స్వయంగా రజినీకాంత్ అనుకున్నది. కల్కీ కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రజినీకాంత్ హర అనే టైటిల్‌తో ఈ సినిమా ముందు చేయాలనుకున్నారు.

అయితే, అప్పటికే ఆయనతో ముత్తు అనే సినిమా చేసి హిట్ ఇచ్చిన దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో ఈ కథ చెప్పారు. ఇద్దరూ ఈ కథపై నమ్మకంతో కాస్త మార్పులు చేర్పులు చేసి పేరు కూడా రజినీ అనుకున్న హర కాకుండా పడయప్పాను రిజిస్టర్ చేయించారు. అదే పేరుతో సినిమాను రజినీకాంత్ ప్రకటించారు. పొన్నియన్ సెల్వన్ కథలోని కొంత భాగాన్ని తీసుకొని డెవలప్ చేసి కమర్షియల్ హంగులతో పాటు అద్భుతమైన పాత్రలను డిజైన్ చేశారు.

అయితే, ఇందులో రజినీకాంత్ సరసన హీరోయిన్స్‌గా నటించిన సౌందర్య, రమ్యకృష్ణలకి ముందు అనుకున్నది మరోలా. రమ్యకృష్ణ చేసిన నీలాంబరి వాస్తవంగా సౌందర్యతో చేయించాలనుకున్నారట. కానీ, ఆమెకి ఫ్యామిలీ హీరోయిన్‌గా పాపులారిటీ రావడం వల్ల ఆ పాత్ర చేస్తే ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని రజనీ మార్చేశారట.

దీనివల్ల సౌందర్య చేయాల్సిన నెగిటివ్ రోల్ నీలాంబరి రమ్య చేసి అసాధారణమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా సౌందర్య చేస్తే ఆ రేంజ్ క్రేజ్ దక్కేదో లేదో గానీ, అప్పట్లో మాత్రం ఈ విషయంలో రజినీ గురించి నెగిటివ్‌గా మాట్లాడుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: