ప్రముఖ డాన్స్ మాస్టర్.. జానీ మాస్టర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ తర్వాత డాన్స్ మాస్టర్ గా అంతకుమించి పేరు సంపాదించుకున్నారని చెప్పవచ్చు.
ఇకపోతే తాజాగా అందించిన సమాచారం ప్రకారం .. జానీ మాస్టర్ ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.. ఇక పూర్తి వివరాలలోకి వస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ తర్వాత గుర్తుకొచ్చే డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ అని చెప్పవచ్చు. ఎలాంటి కష్టభరితమైన మూమెంట్స్ అయినా సరే చాలా సునాయాసంగా చేయగలగడంలో ఈయన తర్వాతే ఎవరైనా.. ఇక అందుకే పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరికి జానీ మాస్టర్ అంటే విపరీతమైన ఇష్టం.
తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో కూడా చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈటీవీ డాన్స్ షో ఢీ తో ఆయన డాన్సర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి .. 2003లో ద్రోణా సినిమాకు కొరియోగ్రఫీ పనిచేశారు. ఇక 2012లో రచ్చ సినిమాకు కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని సంపాదించుకున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే విపరీతమైన ఇష్టం. ఇక 2014లో సల్మాన్ఖాన్ నటించిన జయహో సినిమాకి కూడా ఈయనే కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
కన్నడలో సుదీప్ కిచ్చా నటించిన ఒక సినిమాకు బెస్ట్ కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ కు ఒక కారును కూడా బహుమతిగా ఇచ్చారు సుదీప్ కిచ్చా. టాలీవుడ్ లో ఈయన కొరియోగ్రఫీ చేసిన సినిమాల విషయానికి వస్తే.. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో టైటిల్ సాంగ్ కి అలాగే అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్ కి కూడా ఈయనే కొరియోగ్రఫీ చేశారు. ఇదిలా వుండగా ఈయన భార్య డెలివరీ సమయంలో ఒక్క రూపాయి కూడా చేతిలో లేకపోవడంతో రామ్ చరణ్ సహాయం చేశారు అని రూ.5:లక్షల వరకు బిల్ పే చేశారు అని జానీ మాస్టర్ తెలియజేశారు.

ఈయన ప్రాపర్టీ విషయానికి వస్తే .. ఒక్కొక్క సినిమాకు రూ.30 లక్షల వరకు పారితోషకం తీసుకుంటారట. ఇక స్పెషల్ సాంగ్స్ అయితే రూ.12 లక్షల వరకు అందుకుంటారని సమాచారం. ఇక ప్రస్తుతం హైదరాబాదులో బాగానే ఆస్తులు సంపాదించినట్లు.. బెంగళూరులో కూడా ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేసినట్లు సమాచారం మొత్తంగా రూ.20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: