టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి వయసు పెరుగుతున్నా అంతకు మించిన ఉత్సాహంతో యువ హీరోలకు పోటీగా ధీటుగా సినిమాలను చేస్తున్నాడు. మొన్నీ మధ్యన వచ్చిన ఆచార్య మూవీ మెగా ఫ్యాన్స్ ను చాలా నిరాశ పరిచింది. అందుకే ఇకపై తాను నటించే సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. వాటిలో ఒకటి తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన గాడ్ ఫాదర్ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీ గా ఉంది.

ఇందులో చిరంజీవి ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించే అందరినీ అలరించనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కథ అందరికీ తెలిసింది కావడంతో టీం మొత్తం చాలా కష్టపడి ప్రతి సీన్ విషయంలో కొత్తదనం వచ్చేలా చేశారు. ఈ సినిమా మలయాళంలో వచ్చి బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న లూసిఫర్ కి రీమేక్ గా వస్తోంది. మాములుగా రీమేక్ సినిమాలు అంటే పెద్దగా నిరూపించుకోవలసింది ఏమీ ఉండదు. కానీ ఇది పాన్ ఇండియా మూవీగా వస్తుండడం వలన ఖచ్చితంగా ఒరిజినాలిటీ పోకుండా సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సినిమా నుండి ప్రస్తుతానికి విడుదలైన పోస్టర్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ కావడం చిరంజీవికి చాలా అవసరం. ఆచార్య ప్లాప్ కొట్టుకుపోయేలా గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఇందులో చిరంజీవి కాకుండా సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ మరియు పూరి జగన్నాధ్ లు ఇందులో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నిర్మాణంలో చిరంజీవి నట వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా పలు పంచుకోవడం విశేషం. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఆల్ ది బెస్ట్ టీం అఫ్ గాడ్ ఫాదర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: