తెలుగు సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగర్జున బంగార్రాజు సినిమాతో ప్రెక్షకులను పలకరించాడు..ఆ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది.ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఎక్కడైతే తనకు ఫ్లాపులు వచ్చాయో.. అక్కడే మళ్లీ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపించాలని కత్తి పట్టుకుని యుద్ధానికి బయల్దేరారు..ది ఘోస్ట్ విషయంలో నాగార్జున కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. దసరా ధమాకా ఖాయం అనిపిస్తుంది. తాజాగా మరో ట్రైలర్‌తో వచ్చారు నాగ్. మరి ఇది ఎలా ఉంది..నాగార్జునకు సాలిడ్ బ్లాక్‌బస్టర్ వచ్చి చాలా ఏళ్ళవుతుంది. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్నినాయనా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆ స్థాయి విజయం రాలేదు.


బంగార్రాజు ఓకే అనిపించిందే కానీ నాగ్ రేంజ్ హిట్టైతే కాదు. అందుకే అక్కినేని అభిమానుల ఆశలన్నీ దసరాకు రానున్న ది ఘోస్ట్‌పై ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రంపై ట్రైలర్స్, టీజర్స్ అంచనాలు అంతకంతకూ పెంచేస్తున్నాయి.ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌తో నాగ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మూడేళ్లుగా ఇలాంటి లతోనే దండయాత్ర చేస్తున్నారు ఈ సీనియర్ హీరో. వర్మతో చేసిన ఆఫీసర్.. కొత్త దర్శకుడు సోలోమెన్‌తో చేసిన వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. అయినా కూడా మళ్లీ ప్రవీణ్ సత్తారుతో ది ఘోస్ట్ రూపంలో యాక్షన్ తోనే వస్తున్నారు...


తాజాగా విడుదల అయిన ట్రైలర్ లో రా ఏజెంట్‌గా నటిస్తున్నారు నాగ్. తనకు కొన్నేళ్లుగా కలిసిరాని జోనర్‌లోనే హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు నాగార్జున. గరుడవేగ తర్వాత ప్రవీణ్ సత్తారు చేసిన కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఏకంగా 12 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నాయి. మరి చూడాలి.. దసరాకు గాడ్ ఫాదర్‌, ఘోస్ట్ మధ్య పోరు ఎలా ఉండబోతుందో చూడాలి..అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంటుందని టాక్..మరి ఎలా ఉంటుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: