నేషనల్ క్రష్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి రష్మిక.ఈమె ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా మారిపోయారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.


భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఇకపోతే హిందీలో ఈమె నటించిన డబ్ల్యూ మూవీ గుడ్ బై చిత్రం అక్టోబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారట.


సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తన కెరియర్ ను మలుపు తిప్పిన సినిమాల గురించి ఈమె మాట్లాడారు.తాను కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ సినిమా ను చేశాను. ఈ సినిమా మంచి హిట్ కావడంతో తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే తెలుగులో తాను నటించిన గీత గోవిందం మంచి హిట్ అవ్వడమే కాకుండా తనకు మంచి గుర్తింపు ను తీసుకువచ్చిందని తెలిపారు.


  ఈ సినిమా తర్వాత పుష్ప సినిమాలో అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.ఈ సినిమా తనకు సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో కనుక నటించకపోయి ఉంటే తనకు ఈ గుర్తింపు అయితే ఉండేది కాదని ఈ సినిమాలో నటించడం నిజంగా తన అదృష్టం అని తెలిపారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసి ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోయాము. ఇలా తనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చినప్పటికీ తాను మాత్రం నటనలో సంపూర్ణ నటిగా మారలేదని నిత్యం తను సినిమాల గురించి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉన్నానని ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: