నందమూరి బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో కొన్ని నిజమైతే మరికొన్ని వార్తలు నిజం కాలేదు.

బాలయ్య వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారట.. అయితే మోక్షజ్ఞ లుక్ ను చూసిన అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఇప్పట్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవచ్చని కామెంట్లు కూడా చేస్తున్నారు.

ప్రముఖ జ్యోతిష్కుడు అయిన వేణుస్వామి తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి షాకింగ్ కామెంట్లు అయితే చేశారు. బాలకృష్ణ గారు ప్రతిరోజూ రాహుకాలం చూసుకుంటారని, యమగండ కాలాన్ని చూస్తారని వేణుస్వామి చెప్పారు. బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసినా చెప్పిన టైమ్ మంచి టైమో కాదో చెక్ చేసుకుంటారని ఆయన చెప్పుకొఛ్చారట.. బాలయ్యకు మనం చెప్పాల్సిన అవసరం లేదని ఆయనే చెబుతారని వేణుస్వామి వెల్లడించారు.

బాలకృష్ణ అన్నీ ఫాలో అవుతారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ జాతకం కూడా చూశానని మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి టైమ్ ఉందని వేణుస్వామి పేర్కొన్నారు. మోక్షజ్ఞ సినీ కెరీర్ బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వీలైనంత ఆలస్యంగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని వేణుస్వామి వెల్లడించారట..

మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలంటే రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని వేణుస్వామి షాకింగ్ కామెంట్లు కూడా చేశారు. నాకు తెలిసినంత వరకు మోక్షజ్ఞ సినిమాల్లోనే కెరీర్ ను కొనసాగిస్తారని వేణుస్వామి కామెంట్లు చేశారు. మోక్షజ్ఞ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదని ఆయన చెప్పుకొచ్చారు. వేణుస్వామి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో వేణుస్వామి చెప్పిన విషయాలు నిజమవుతాయో లేదో చూడాలి మరి.మోక్షజ్ఞ ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: