దేవిశ్రీ ప్రసాద్ ఓ మాస్ బీట్‌ని రెడీ చేశాడని, త్వరలోనే ఈ సాంగ్‌ని షూట్ చేయబోతు న్నారని తెలుస్తోంది. చిరంజీవి నటించిన 'అన్నయ్య'లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన రవితేజ, ఆ తర్వాత 'శంకర్ దాదా జిం దాబాద్'లో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిశాడు. మళ్లీ ఇన్నా ళ్లకి వీరి కాంబోలో రానున్న చిత్రం కావడం తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి 'వాల్తేరు వీరయ్య' అనే పేరుని ఫిక్స్ చేశారు కానీ అధికారి కంగా ప్రకటిం చలేదు. దీపావళి కానుకగా రేపు ఉదయం పదకొండు గంటలకు టైటిల్‌తో పాటు టీజర్‌ని కూడా లాంచ్ చేయనున్నారు. శ్రుతీ హాసన్ హీరో యిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'ని కూడా అప్పుడే విడుదల చేస్తున్నట్టుతాజాగా ప్రకటించారు. ఇద్దరు స్టార్ హీరోలు కావడం, రెండు చిత్రాల్నీ ఒకే సంస్థ ప్రొడ్యూస్ చేస్తూ ఉండటం తో డైలమా ఏర్పడింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఇద్దరూ పోటీ పడతారా లేక డేట్స్‌లో మార్పు లేమైనా చేసుకుంటారా అనేది వేచి చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి