మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం వరుస లతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఖిలాడి చిత్రంలో అలరించిన ఈ హీరో శరవేగంగా తన తదుపరి చిత్రాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట రవితేజ. రవితేజ చేస్తున్న చిత్రాలలో రావణసుర కూడా ఒకటి.

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఇభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ మరియు మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారట.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ దీపావళి కానుకగా విడుదల డేట్ ప్రకటించారట సినిమా మేకర్స్.

వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 7న రావణాసుర థియేటర్లలో సందడి చేయనుందని తెలుస్తుంది.. విడుదల తేదీని ప్రకటిస్తూ మాస్ మాహారాజా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో రవితేజ డిఫరెంట్ గా మాస్ లుక్‏లో కనిపిస్తున్నారట.. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో రవితేజ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారని.. ఈ పాత్ర కోసం కొంత మంది లాయర్లను కలిసి వారి బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నారట. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారట.

ఈ సినిమానే కాకుండా రవితేజ.. ధమాకా , టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయట.. ధమాకా చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య లో మాస్ మాహారాజా అతిథి పాత్రలో కూడా కనిపించనున్నారు.రవితేజ ఇప్పటికే మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ చేస్తూ అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాడు. తరువాత దర్శకుడు బాబీ తో పవర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత తన సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: