ఇలా దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది జబర్దస్త్. తర్వాత ఎన్నో కామెడీ షోస్ వచ్చినప్పటికీ జబర్దస్త్ కి మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. అది సరే గాని ఇంతకీ ఇప్పుడు జబర్దస్త్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.. జబర్దస్త్ లో ఇటీవల ఎవరు ఊహించని ఒక పెద్ద మార్పు జరిగింది. జబర్దస్త్ మొదలైన నాటి నుంచి యాంకర్ గా కొనసాగిన అనసూయ ఇటీవల అనూహ్యంగా జబర్దస్త్ ఉంచి తప్పుకుంది. దీంతో కొత్త యాంకర్ వస్తుంది అనుకున్నప్పటికీ ఇక పాత యాంకర్ రష్మీ నే జబర్దస్త్ లో కొనసాగించారు.
కానీ ఇప్పుడు మాత్రం మల్లెమాల నిర్వాహకులు ఏకంగా జబర్దస్త్ యాంకర్ ను మార్చేశారు. ఇది కాస్త బులితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన పంచులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సౌమ్యరావును జబర్దస్త్ యాంకర్ గా తీసుకొచ్చారు మల్లెమాల యాజమాన్యం. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే రశ్మిని మొత్తానికే తీసేసారా లేకపోతే కేవలం రెండు మూడు ఎపిసోడ్ల కోసం సౌమ్యరావుని తీసుకువచ్చారా అన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి