తెలుగు,తమిళ,మలయాళ ప్రేక్షకులకు తన నటన తో చాలా దగ్గరైంది హీరోయిన్ అమలాపాల్. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక అమలాపాల్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతి వీడియోలో తన లైఫ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొస్తుంది. ఇక అసలు అమలాపాల్ చదువు కంప్లీట్ అయ్యేవరకు సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. అలాగే అమలాపాల్ ముందు ఇంజనీరింగ్ చదవాలని అనుకుందట.కానీ వీలుకాక బి.ఏ చదివిందట. అలాగే డిగ్రీ చేసే టైంలో ఏదో సరదాకి మోడలింగ్ అనే ఆలోచన ఆమె మైండ్ లోకి రావడం తో అది ఆమె జీవితాన్నే మార్చింది.

ఇక ఆమె మోడలింగ్ చేసే టైంలో ముంబై ఫ్యాషన్ వీక్ లో ఓ డైరెక్టర్ ఆమెను చూసి సినిమా అవకాశాన్ని ఇచ్చాడట. ఇలా 2009లో మలయాళ సినిమా అయినా నీలతామర అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్. ఆ తర్వాత తమిళంలో ఈమె నటించిన మైనా అనే సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ సినిమా ఆమె కెరియర్ లోనే పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మైనా సినిమాతో అమలాపాల్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయిందట. అలాగే తెలుగులో కూడా నాగచైతన్య నటించిన బెజవాడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్,అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కూడా నటించి మరింత మంది అభిమానులను సంపాదించుకుందట.

అయితే అమలాపాల్ సినిమాల్లోకి వచ్చినప్పటికీ తన చదువును మాత్రం దూరం పెట్టలేదు. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు కష్టపడి తన డిగ్రీ ని కంప్లీట్ చేసింది. అయితే సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడే కోలీవుడ్ లో ఉన్న ఓ స్టార్ హీరోతో లవ్లో పడిందట. కానీ ఆ స్టార్ హీరోకి అప్పటికే పెళ్లయినా కూడా అమలాపాల్ అతని మోజులో పడి ఎప్పుడు అతని వెనకాలే తిరిగేదట. అలా హీరో మోజులో పడి పూర్తిగా తన సినీ కెరీర్ ని మర్చిపోయి అతని చుట్టూనే తిరిగేదట. అంతేకాదు ఆ హీరో వల్లే తన కెరియర్ నాశనం అయిందని నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది కేవలం ఆ హీరో తో ఎఫైర్ పెట్టుకోవడమే అని అమలాపాల్ ఓ సందర్భంలో చెప్పుకొని ఎంతో బాధపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: