అనసూయ, పవిత్ర లోకేష్ రెండు వేర్వేరు నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటా మరీ. అరెస్ట్ లు కూడా చోటు చేసుకున్నాయి. ఈ విషయంపై ఇద్దరు నెటిజెన్స్ మధ్య జరిగిన సంభాషణను అనసూయ ట్వీట్ చేశారు.

 
యాంకర్ అనసూయ చాలా కాలంగా సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొంటున్నారు అని మనకు తెలిసిందే. అయితే తనను ట్రోల్ చేసేవారి మీద ఆమె పోరాటం చేస్తున్నారు. శృతి మించి అసభ్యకర పోస్ట్స్ పెడుతున్న కొందరిపై ఆమె చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు.

 
తాజాగా అనసూయ ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాకు చెందిన వీర్రాజు అనే వ్యక్తి అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణుప్రియ, నటి ప్రగతి వంటి సెలెబ్రిటీలను ట్రోల్ చేయడంతో పాటు అసభ్యకర పోస్ట్స్ పెడుతున్నాడు. వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్స్ క్రింద కేసును కూడా నమోదు చేశారు.

 
అలాగే నటి పవిత్ర లోకేష్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తనపై నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలతో కథనాలు ప్రసారం చేస్తున్నారు. నరేష్ తో తన రిలేషన్ గురించి దారుణమైన కథనాలకు పాల్పడుతున్నారని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ కంప్లైంట్ ఆధారంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో పాటు వెబ్ సైట్స్ పై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

 
ఈ రెండు సంఘటనలు ఇద్దరు నెటిజెన్స్ మధ్య చర్చకు వచ్చింది. ట్విట్టర్ లో ట్రోల్స్ అంత సెన్సిటివా?. పవిత్ర లోకేష్ కంప్లైంట్ చేశారట, ఏమైంది? అని ఒక నెటిజన్ మరొక నెటిజన్ ని అడిగాడు. అవును పవిత్ర లోకేష్ కంప్లైంట్ ఆధారంగా 8 యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకున్నారట. అరెస్ట్ చేశారట అని సమాధానం చెప్పాడు మరొక నెటిజెన్.

 
దానికి ఫస్ట్ నెటిజెన్.. మార్ఫింగ్ చేశారని అనసూయ కంప్లైంట్ ఇస్తే కూడా అరెస్ట్ చేస్తారా? అని అడిగాడు. దానికి సెకండ్ నెటిజెన్... నరేష్ అంటే పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు. అనసూయకు అంత సీన్ లేదులే అని సమాధానం  కూడా చెప్పాడు. ట్విట్టర్లో ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అనసూయ రీపోస్టు చేశారు. వారి అమాయకత్వానికి నవ్వు వస్తుంది అన్నట్లు ఒక స్మైల్ ఎమోజీ పోస్ట్ చేసింది.

అనసూయ వల్ల ఏమి కాదు ఆమెకు నరేష్ మాదిరి బ్యాక్ గ్రౌండ్ లేదని చెప్పడాన్ని అనసూయ ఇక్కడి పాయింట్ చేశారు. అలా అనుకుని పిచ్చి వేషాలు వేస్తే శిక్షలు తప్పవని అనసూయ ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. లైగర్ మూవీ వివాదంలో అనసూయను ఆంటీ అంటూ వేల సంఖ్యలో ట్రోల్  బాగానే చేశారు. వారిలో కొందరిపై అనసూయ కంప్లైంట్ చేయడం జరిగింది.

 
అయితే అనసూయ అనవసర వివాదాల్లో తలదూర్చడం కూడా ఈ ట్రోల్స్ కి కారణం. లైగర్ మూవీ వివాదంలో ఆమెదే తప్పని చెప్పాలి మనం. ఎప్పుడో అర్జున్ రెడ్డి మూవీ నాటి వివాదాన్ని తెరపైకి తెచ్చి గొడవ రాజేసింది. అసలే లైగర్ కి ప్లాప్ టాక్ రావడంతో డిసప్పాయింట్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై విరుచుకుపడ్డారు. ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: