కోలీవుడ్  స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారిసు'.తెలుగులో 'వారసుడు' గా విడుదల అవుతుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్  చేస్తుండగా ఇంకా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ చిత్రంలో హీరో విజయ్ లుక్స్ పరంగా ఇంకా అలాగే పర్ఫార్మెన్స్ పరంగా కూడా సినిమాను ఖచ్చితంగా మరో లెవెల్‌కు తీసుకెళ్తాడని మూవీ యూనిట్  చాలా ధీమా వ్యక్తం చేస్తోంది.సంక్రాంతి పండుగ బరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, వారిసు సినిమాని తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు దిల్  రాజు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో వారిసు సినిమాకి హిందీలో ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అని అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూడగా..'వారిస్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేయడం జరిగింది.


ఇక ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో తంటాలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే తెలుగులో సంక్రాంతి పండుగ టైం లో  సీనియర్లు అయిన చిరంజీవి, బాల కృష్ణ సినిమాలు విడుదల కాబోతున్నాయి.చిరంజీవి వాళ్తేరు వీరయ్యగా రాబోతుంటే బాలయ్య వీర నరసింహరెడ్డిగా రాబోతున్నాడు.అందువల్ల థియేటర్లు వీళ్ళకి ఎక్కువ కేటాయించాలా లేదా పరభాష హీరో విజయ్ కి ఎక్కువ కేటాయించాలా అనే విషయంలో ప్రస్తుతం టాలీవుడ్ లో వివాదం జరుగుతుంది.అయితే కొంతమంది తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మన సినిమాల కంటే విజయ్  సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఏమవుతుంది. ఇక వారసుడు సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్.. సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: