మలయాళ ముద్దుగుమ్మగా తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది ఈమె. ఇక ఈమె హీరోయిన్గా నటించిన రెండు సినిమాలలోనూ హీరోగా నిఖిల్ నటించిన జరిగింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. ఈ రెండు సినిమాల అనంతరం ఇప్పుడు బటర్ఫ్లై అనే సినిమాలో కూడా నటించింది ఈమె.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన డిస్నీ ప్లస్ లో విడుదల కానుంది. 

ఈ సినిమాని కూడా భారీ అంచనాల నడుమ విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్ర బృందం. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు చిత్ర బృందం. అయితే తాజాగా అనుపమ పరమేశ్వరునికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అనుపమ నటించిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకోవడంతో ఈమె తదుపరి సినిమాకి గాను రెమ్యూనరేషన్ను భారీగా పెంచేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఒక్క సినిమాకి 60 నుండి 70 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

 కానీ ఈ ఏడాది ఆమె నిఖిల్ తో జంటగా నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టలు అందుకోవడంతో ఇంతకుముందు రెమ్యూనిరేషన్ కంటే ఇప్పుడు డబుల్ రెమ్యూనరేషన్ను తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఒక్క సినిమాకు గాను 1.3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈమె క్రేజ్ మరియు అందాన్ని దృష్టిలో పెట్టుకున్న అనేక మంది నిర్మాతలు ఆమె డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారట. ఇక ఈ ఏడాది ఈమె ఎలాంటి సినిమాలను చేస్తుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: