టాలీవుడ్ హాట్ హీరోయిన్ సమంత మీద యంగ్ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ గా ఫైర్ అవుతున్నారు.. 'ఇదేం పద్ధతి కాదు' అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెపై ఒక రేంజిలో కోపం వ్యక్తం చేస్తున్నారు.తమ హీరోకి పైగా తనకి లైఫ్ ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టి ఆదుకున్న నిర్మాతలకు హ్యాండిచ్చి 'బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కోసం ముంబై వెళ్లడంలో నీ ఉద్దేశమేంటి సమంత?' అని నెటిజన్స్ సమంతని పచ్చి బూతులు తిడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..విజయ్ దేవరకొండ ఇంకా సమంత జంటగా.. 'నిన్నుకోరి', 'మజిలీ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలోమైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ ఫిలిం 'ఖుషి'లో సామ్ - విజయ్ నటిస్తున్నారు. ఇంకా ఈ కాంబో అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ ప్రాజెక్టు మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.


కట్ చేస్తే.. అనుకోకుండా సామ్ అనారోగ్యం పాలవడంతో 'ఖుషి' కి బ్రేక్ పడింది. హీరో, డైరెక్టర్ మరో సినిమాకి షిఫ్ట్ అవకుండా వేరే పనులు చూసుకుంటున్నారు. సామ్ ఎప్పుడు కోలుకుని వస్తే అప్పుడే సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళదాం అని వెయిట్ చేస్తున్నారు.విశ్రాంతి తీసుకుంటూనే 'శాకుంతలం' సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేసింది. మధ్యలో ఓసారి ముంబై కూడా వెళ్లి వచ్చింది. ఇప్పుడు హిందీలో వరుణ్ ధావన్ తో నటిస్తున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటుంది అంటూ అమెజాన్ వారు అధికారికంగా ప్రకటిస్తూ.. సామ్ ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ''25 శాతం కంటే తక్కువే బ్యాలెన్స్ ఉన్న 'ఖుషి' సినిమాని కంప్లీట్ చేయకుండా.. బాలీవుడ్ కి పోవటం ఏంటి? నీకసలు కొద్దిగా అయిన విశ్వాసం ఉందా? నీ బుద్ధి మందగించించా అంటూ ఫైర్ అవుతున్నారు. నిజానికి పచ్చి బూతులు తిడుతూ సమంతని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: