తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంటున్నారు. గత సంవత్సరం బింబి సారా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా తన కెరియర్ లోని అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా మైత్రి మూవీ బ్యానర్ పై డైరెక్టర్ రాజేందర్రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆమిగొస్. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ నటిస్తున్నది. ఈనెల 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేస్తున్నారు.


అలా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఈ రోజున జరపనున్నారు. అందుకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు మైత్రి మూవీ వేరు అధికారికంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్ గా ఉండడమే కాకుండా కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపించబోతున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.


ఇక ఈ చిత్రంలో బ్రహ్మాజీ ,సప్తగిరి ,చైతన్య కృష్ణ, కళ్యాణి నటన రాజన్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తోంది. జీబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం లో నటిస్తూ ఉన్నారు. మరి వరుస సినిమాలతో సక్సెస్ అవుతున్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో కూడా సక్సెస్ అవుతారేమో చూడాలి. ఈ సినిమా అయిపోయిన వెంటనే కళ్యాణ్ రామ్ డెవిల్ అనే ఒక సినిమాల నటించబోతున్నారు ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతున్నట్లు సమాచారం ఈ చిత్రంలో ఒక బ్రిటిష్ ఏజెంట్గా నటించబోతున్నారు కళ్యాణ్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: