సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియన్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది  కియారా అద్వానీ. తెలుగులో ఈమె భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ మొట్టమొదట వెండితెరపై కనిపించింది మాత్రం సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటించిన ఎమ్మెస్ ధోని అనే సినిమాతో. అలా ఈ రెండు సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె అటు బాలీవుడ్ మరియు ఇటు టాలీవుడ్ లో సైతం వరుస అవకాశాలు దక్కించుకుంది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా అనంతరం రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన జరిగింది. 

తాజాగా ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో రానన్న ఒక సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈమె ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. రాజస్థాన్ లోని జైసల్మీర్ లోని ప్యాలెస్ లో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు మరియు ఆతిరథ మహారాజుల సమక్షంలో చాలా బాగా జరిగింది. ఇక ఈ వివాహ మహోత్సవానికి చాలామంది బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది. కానీ టాలీవుడ్ నుండి మాత్రం ఏ ఒక్కరు కూడా వీరిద్దరి పెళ్ళికి హాజరు అవ్వలేదు. తెలుగులో ఈమె మహేష్ బాబు మరియు రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఈమె వారిని పిలవక పోవడంతో చాలామంది ఇప్పుడు తప్పు పడుతున్నారు.

 మహేష్ బాబుతో ఈమెకి పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ రామ్ చరణ్ తో మాత్రం  బాగా క్లోజ్ గా ఉండేది. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమాలో కూడా చేస్తోంది ఈమె. ఇంత క్లోజ్ గా వీరిద్దరూ ఉన్నప్పటికీ రామ్ చరణ్ ని వివాహానికి పిలవక పోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ మలమూత్ర కి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే పెద్దగా నచ్చదట. ఇక ఆయన ఆదేశం మేరకు కీయారా ఆద్వానీ కూడా టాలీవుడ్ హీరోలను ఆహ్వానించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. ఇక ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: