మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమైనప్పటికీ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అందరూ హీరోలు. ఇక వారిలో సాయిధరమ్ తేజ్ కూడా ఒక మొదట్లో కొన్ని సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్న సాయి ధరమ్ తేజ్  ఈమధ్య ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగులుతున్నాయి. దీంతో సతమతం అవుతున్నాడు సాయి ధరంతేజ్ ఈ మధ్యనే  పెద్ద బైక్ యాక్సిడెంట్ కి గురై ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా సంగతి చాలామందికి తెలిసిందే.

 ఇక తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత రిపబ్లిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా విరూపాక్ష పైనే పెట్టుకున్నాడని తెలుస్తోంది. సుకుమార్కి అసిస్టెంట్ డైరెక్ట్ గా పనిచేసిన కార్తీక్ దండు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. అంతే కాదు ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాతో  ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా సాయి ధరంతేజ్ కెరియర్ పై చాలా ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు విరూపాక్ష సినిమా విషయంలో ప్రత్యేక బాధ్యతను తీసుకుంటున్నట్లుగా సమాచారం. సినిమా ఓకే చేసినప్పటి నుండి చిరు ఈ సినిమాపై ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది .అంతేకాదు ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటూ ప్రతి విషయానికి గురించి ఆరా తీస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వినోదయ సీతం రీమేక్ విషయంలో ఎలాగో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని చిరంజీవి విరూపాక్ష సినిమాతో సాయిధరమ్ తేజ్ కి ఒక మంచి హిట్ ని అందించాలని చిరంజీవి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్త వహిస్తున్నట్లుగా కూడా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: