సినిమా ఇండస్ట్రీలో నైనా సర్వ సాధారణమైన విషయం ఏంటంటే స్టార్స్ మధ్య ప్రేమ వ్యవహారాలు.స్టార్ హీరోల దగ్గరి నుంచి మొదలు పెడితే సాధారణ ఆర్టిస్టుల దాకా చాలామంది ప్రేమలో పడ్డారు.

ఐతే అందులో కొందరు పెండ్లి చేసుకుని సెటిల్‌ అయిపోతే మరికొందరు మాత్రం డేటింగ్ పేరుతో టైమ్ పాస్ చేసి వదిలేస్తున్నారు. ఐతే వాటిలో భాగంగానే అప్పట్లో కమెడియన్‌ సునీల్ మీద కూడా ఇలాంటి రూమర్లు బాగానే పుట్టుకొచ్చాయి.

ఐతే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు వీరిద్దరికీ సంబంధం ఏముంది అనేది ఒక ప్రశ్నర్ధకంకా మిగిలింది. ఐతే డానికి సమాధానం గా అప్పట్లో వీరిద్దరి కాంబోలో మంచి కామెడీ సీన్లు వచ్చేవి. కొన్ని సినిమాల్లో వీరిద్దరూ లెక్చరర్‌-స్టూడెంట్ గా నటిస్తే మరికొన్ని సినిమాల్లో మాత్రం వీరిద్దరూ భార్యా, భర్తలు గా కూడా యాక్ట్ చేశారు. అయితే వీరిద్దరిపై ఒకానొక టైం లో రూమర్లు బాగానే వచ్చాయి.

యాంకర్ ఝాన్సీ,సునీల్‌ వీరిద్దరూ రిలేషన్‌ లో ఉన్నా రంటూ అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి. ఐతే దీనికి మెయిన్ రీసన్ పెండ్లైన కొత్తలో మూవీ చేయడమే. ఈ మూవీలో వీరిద్దరూ కలిసి భార్య, భర్తలు గా నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ  రూమర్లు బాగా పుట్టుకు వచ్చాయి. దాంతో వీరిద్దరూ అప్పట్లో హాట్ టాపిక్‌ గా నిలిచిపోయారు.

ఐతే ఆ రూమర్ల పై వీరిద్దరూ అప్డేటెడ్ గా ఎప్పటి కప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. ఐతే తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే అని, ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకు వచ్చారు. ఆ తర్వాత తర్వాత కాలం లో బుల్లి తెరపై ఝాన్సీ యాంకర్‌ గా బిజీ గా అయిపోయింది. ఆ టైములో సునీల్‌ కూడా సినిమాల్లో చాలా బిజీ అయిపోయాడు.
ఆ విధంగా వారిద్దరి మధ్య ఉన్నా రూమర్ కూడా సమాప్తం ఐపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: