తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ ... వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ అనే మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పలు మూవీ లలో హీరో గా నటించిన అఖిల్ కొంత కాలం క్రితం విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇలా కెరియర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకొక పాట మరియు కొన్ని చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే వీటిని కూడా పూర్తి చేసి ఈ మూవీ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: