అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా హీరోల సినిమాల్లో హీరోయిన్లకు సంబంధించి వచ్చిన వార్తలు పుకార్లు గానే మిగిలిపోతే మరికొన్నిసార్లు మాత్రం ఇలా తెర మీదికి వచ్చిన గాసిప్స్ నిజం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఒక గాసిప్ ఇలాగే టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా వస్తుంది. గతంలో వీరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక మోహనన్ ఛాన్స్ కొట్టేసింది అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈమె ఎక్కువగా మలయాళ మూవీలో నటించి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇక ఈ గాసిప్స్ పై ఇటీవలే మాళవిక స్వయంగా స్పందించింది. తాను పవన్ కళ్యాణ్ మూవీలో నటించటం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే మరో తెలుగు సినిమాలో నటిస్తున్నాను అంటూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసింది. అయితే ప్రభాస్ సినిమాలో కూడా మాళవిక నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మాళవిక చెప్పిన మరో సినిమా ప్రభాస్ దే కావచ్చు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.