మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో వెంకీ మూవీ ఒకటి. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఒకరు అయినటువంటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రవితేజ సరసన స్నేహ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 26 మార్చ్ 2004 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో అద్భుతమైన కథ ఉండడం అందుకు తగిన యాక్షన్స్ సన్నివేశాలు ... సెంటిమెంట్ సన్నివేశాలు ... అద్భుతమైన కామెడీ ఉండడంతో ఈ మూవీ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

ముఖ్యంగా ఈ మూవీ లో రైల్లో రవితేజ ... బ్రహ్మానందం ... వేణు మాధవ్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికి కూడా ఈ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకొని అదిరిపోయే కలెక్షన్ లను సాధించిన ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 19 ఏళ్ళు అవుతుంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన ప్రేక్షకుల నుండి ఈ మూవీ కి మంచి ఆదరణ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: