మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం రవితేజ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన షాక్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ తోనే హరీష్ దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అలా షాక్ మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టిన హరీష్ ఆ మూవీ తోనే అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ రవితేజ ... హరీష్ కు అవకాశం ఇచ్చాడు. దానితో హరీష్ ... రవితేజ తో మిరపకాయ్ అనే మూవీ ని తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకొని ... దర్శకుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే రవితేజ మరో సారి హరీష్ దర్శకత్వంలో పని చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం హరీష్ ... రవితేజ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్లు ... అన్ని కుదిరితే రవితేజ తో మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. హరీష్ మరి కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ తర్వాత హరీష్ ... రవితేజ హీరోగా ఒక మూవీ ని చేసే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: